ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 13:06:13

అప్రమత్తతో ముందుకెళ్దాం..కరోనాను తరిమికొడుదాం

అప్రమత్తతో ముందుకెళ్దాం..కరోనాను తరిమికొడుదాం

సూర్యాపేట : లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న 72 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కోదాడకు చేరుకున్న మంత్రి నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా వ్యవస్థలు అన్ని  స్తభించిపోయాయన్నారు.

లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. కరోనా మహమ్మారితో ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అంతరాష్ట్ర రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోదాడ వద్ద ఉన్న  తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రాకపోకలు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం మునగాల మండలం నరసింహులగూడం గ్రామ కాంగ్రెస్ ఎంపీటీసీతో పాటు మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమాల్లో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి ఉన్నారు


logo