సిర్పూర్(టీ), అక్టోబర్ 20 : పట్టాలపైకి చేరుకొన్న మందను రైలు ఢీకొనగా 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ భీమయ్యకు 250 గొర్రెలు-మేకలు ఉన్నాయి.
వాటిని మేపు తూ శనివారం సాయంత్రం సిర్పూర్(టీ) మండలం ఆరేగూడ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆదివారం తెల్లవారుజా మున గొర్రెల మంద ఒక్కసారిగా రైలు పట్టాలపైకి చేరింది. అదే సమయంలో వచ్చిన రైలు మందను ఢీకొట్టడంతో 200కి పైగా గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనతో భీమయ్య కన్నీరుమున్నీరయ్యా డు. సుమారు రూ.16 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని, సర్కారు నష్టపరిహారం అం దించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.