ధర్మపురి, సెప్టెంబర్ 5 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హమీలు అమలు చేయక పోవడంతో బుగ్గారం, వెల్గొండ, సిరికొండ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బుగ్గారం వేదికగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను గ్రామగ్రామాన ఎండగట్టాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.