న్యూశాయంపేట, డిసెంబర్ 1 : అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో బీఆర్ఎస్ పార్టీయే పాలుపంచుకుంటుదని మాజీ చీఫ్‌విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ పేర్కొన్నారు. హనుమకొండ 49వ డివిజన్ నాగేంద్రనగర్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు 200 మంది కంది యాదగిరి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు విష్ణువర్ధన్, రాజు అధ్యక్షతన ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. దాస్యం వినయ్‌భాసర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షాన పోరాడేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.
ముంబై, డిసెంబర్ 1: డిజిటల్ అరెస్టు అంటూ బెదిరింపులకు దిగుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తా జాగా ముంబైకి చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల మోసానికి గురైంది. ఈ ఘటన నవంబర్‌లో ఓ హోటల్ గదిలో చోటుచేసుకుంది. ఓ ఔషధ తయారీ సంస్థలో పనిచేస్తున్న బాధిత మహిళను తొలుత మనీలాండరింగ్ కేసుందని నేరగాళ్లు బెదిరించారు. అటు తర్వాత బలవంతంగా హోటల్ గదికి రప్పిం చి.. ‘బాడీ వెరిఫికేషన్’ చేయాలంటూ బాధిత మహిళతో దుస్తులు విప్పించారు. ఆన్లైన్ ద్వారా రూ.1.7 లక్షలు కాజేశారు.