Accident | సంక్రాంతి వేళ ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి పెబ్బేరు మీదుగా కర్నూలు వెళ్తున్న కొల్లాపూర్ డిపో బస్సు మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో డ్రైవర్‌తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నాలుగు అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బస్సు యాక్సిడెంట్ కారణంగా కర్నూలు వైపు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద, ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొన్న హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు
ప్రమాదంలో 31 మంది ప్రయాణికులకు గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
క్షతగాత్రులను చికిత్స… pic.twitter.com/UFMioohMee
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026