మక్తల్, ఏప్రిల్ 10 : 2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. నర్వ మండలం లంకాలలో నాసిరకం విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గ్రామానికి చెందిన కురువ బాలరాజు పొలంలోని షెడ్డులో ఐదు బ్యాగుల్లో ఉన్న 2 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్పీ యోగేశ్గౌతమ్ తెలిపారు. ఎవరైనా రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు అమ్మాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.