Tummala Nageswara Rao | నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు.. ఆపైన ఉన్న మొత్తాన్ని బ్యా ంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. ఇలాం టి ఖాతాలు రాష్ట్రంలో 10 వేల నుంచి 12 వేల వరకు ఉంటాయని, రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమా ఫీ చేశామని వెల్లడించారు. శనివారం నల్లగొం డ పట్టణంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో రైతుబడి య్యూటూబ్ చానల్ ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పోను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయబోమని స్పష్టంచేశారు.
100% రుణమాఫీ అయితే రాజీనామా చేస్తా
హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ వందశాతం అయినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. అసెం బ్లీ మీడియా హాల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ‘ఏ గ్రామానికైనా వెళ్లి రైతుల సమక్షంలోనే చర్చ పెడు దాం.. రుణమాఫీ 100శాతం పూర్తయిందని రైతులంటే నేను దేనికైనా సిద్ధం. కాలేదని చెబితే రేవంత్‌రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొంటారా? రా జీనామా చేస్తారా? ఏం చేస్తారో చెప్పా లి’ అని సవాల్ విసిరారు.
‘సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించండి’
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల కు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో వైద్య సౌకర్యాలు కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసొసియేషన్ కోరింది. శనివారం అసొసియేషన్ అధ్యక్షుడు రాంచందర్‌రావు సచివాలయంలో డిప్యూటి సీఎం విక్రమార్కను కలిసి వినితిపత్రాన్ని సమర్పించారు.
సీఎస్‌సీఎస్ చైర్మన్‌తో మాజీ ఐఏఎస్ భేటీ
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : మాజీ ఐఏఎస్ షఫీక్ ఉజ్ జమాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. సెంటర్ ఫర్ సోషల్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టడీస్అండ్ హెల్ప్ హైదరాబాద్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, సభ్యులతో శనివారం సమావేశమయ్యారు. వక్ఫ్ సవరణ చట్టం-2024పై చర్చించినట్టు తెలిసింది. సమావేశంలో ఖాద్రీ, షకీల్, మాజిద్, అన్వర్, సబా ఖాద్రీ, ఆరిజ్ మహ్మద్,అఫ్సర్ పాల్గొన్నారు.
విద్యాఫలాలు అందిరికీ అందేలా చూడండి: టీఆర్టీఎఫ్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): విద్యా ఫలాలు అందరికీ అందేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. విద్యాసంస్కరణలకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబును టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి శనివారం సచివాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా కమిషన్‌ను సైతం త్వరలో ఏర్పాటు చేయాలని కోరారు.