నిజామాబాద్ : మాక్లూరు మండలం చిక్లి గ్రామంలో రెండు కుటుంబాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నాయి. వరి కోత మిషన్ విషయంలో శేఖర్, హనీష్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త ముదరడంతో.. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు చిక్లి గ్రామానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఇరు కుటుంబాలను పోలీసులు కంట్రోల్ చేశారు.