TGTET | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 2.48లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు 71వేలు, పేపర్-2కు 1.55లక్షలు, రెండు పేపర్లకు కలిపి 20వేల మంది చొప్పున మొత్తంగా 2.48లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
టెట్లో దొర్లిన తప్పులను 22లోపు సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.