హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ) : సనత్‌నగర్ టిమ్స్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 184 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో 31 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు వచ్చే నెల 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రొఫెసర్లు(5), అసోసియేట్ ప్రొఫెసర్లు(2), అసిస్టెంట్ ప్రొఫెసర్లు(24) ఖాళీలు ఉన్నట్టు వెల్లడించింది.
అభ్యర్థులు జూన్ 6న ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని కోరింది. ప్రొఫెసర్లకు రూ.2.20లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.88లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1,42,506 వేతనం ఉంటుంది. ఇవి గాక 98 టెక్నికల్, 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరో 31 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్టు నిమ్స్ మరో నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ 31 పోస్టులకు వచ్చే నెల 6న సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులను ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్-500008కి 2 పోస్టు ద్వారా పంపాలని కోరింది.