హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్) స్పోర్ట్స్ క్యాటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఫలితాలను http://epanchayat.telangana.gov.in వెబ్సైట్లో చూసుకోవాలని సూచించింది. పంచాయతీరాజ్‌శాఖలో మొత్తం 9,355 పోస్టుల భర్తీకి 2018 ఆగస్టు 31న నాటి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021లో రాత పరీక్షలు నిర్వహించింది. వివిధ రకాల పోస్టులు భర్తీ కాగా, స్పోర్ట్స్ క్యాటగిరీ కింద 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నది. సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన శనివారం ప్రకటనలో తెలిపారు.
నేడు పీఆర్టీయూ టీఎస్ 36వ సర్వసభ్య సమావేశం
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : పీఆర్టీయూ టీఎస్ 36వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ తెలిపారు. జిల్లెల్లగూడలోని సామా యాదిరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి హాజరుకానున్నట్టు వెల్లడించారు.