హైదరాబాద్, మహబూబాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్‌లోని నర్సింగ్ కాలేజీలో ఫుడ్‌పాయిజన్‌తో 17 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గురుకుల పాఠశాలల్లో వందలాది విద్యార్థులు దవాఖాన పాలయ్యారని తెలిపారు. ఇటీవల ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోనూ కలుషిత ఆహారంతో 90 మంది రోగులు అవస్థలు పడ్డారని, ఓ వ్యక్తి చనిపోయారని గుర్తుచేశారు. కాం గ్రెస్ పాలనలో పాఠశాలలు, కాలేజీలు, దవాఖానల్లో ఆహార భద్రతా ప్రమాణా లు పాటించడంలేదని విమర్శిస్తున్నారు.