హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నిరుడు ఫిబ్రవరిలో17 కేసులు నమోదు చేసినట్టు డీజీ విజయ్‌కుమార్ తెలిపారు. వీటిలో 15ట్రాప్ కేసులు, 2 అసమాన ఆస్తుల కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా 23 మంది ప్ర భుత్వ ఉద్యోగులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు వెల్లడించా రు. బీసీసంక్షేమం, ఇంధనం, గృ హ, అటవీ, వ్యవసాయం తదితర శాఖల ట్రాప్కేసుల్లో 7.60 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు, అసమాన ఆస్తుల కేసుల్లో 4.13కోట్ల ఆస్తులను గుర్తించినట్టు తెలిపారు.
శ్రవణ్ కుమార్ బెయిల్ పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ‘ఐన్యూస్’ సంస్థ ఎండీ శ్రవణ్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ కే సుజన డిస్మిస్ చేశారు. చాలా కాలం నుంచి పరారీలో ఉన్న పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసే ఆసారం లేదని తీర్పులో పేరొంది.