హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా గత 6 నెలల్లో 165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ప్రకటించింది.
రాష్ట్రంలోని 7 సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 76 కేసుల్లో వీరి పాత్ర ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా 795 కేసులు, దేశవ్యాప్తంగా 3,357 కేసులతో సంబంధం ఉన్న వీరిని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, అసోం, ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో అదుపులోకి తీసుకున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.