హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ) : 16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్‌లుగా ఉద్యోగోన్నతి లభించింది. 16 మందిని కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా నియమిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు ఈ జాబితాను ప్రకటించింది. ఒకేసారి 16 మందికి కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఉద్యోగోన్నతి కల్పించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన వారిలో డీ మధుసూదన్‌నాయక్, ఎం సత్యవాణి, జే భవానీశంకర్, జీ లింగ్యానాయక్, ఏ నర్సింహారెడ్డి, జీ వీరారెడ్డి, జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్, యూ రఘురాంశర్మ, పీ చంద్రయ్య, జీ ముకుందరెడ్డి, ఏ భాస్కర్‌రావు, వైవీ గణేశ్, అబ్దుల్ హమీద్, బీ వెంకటేశ్వర్లు, ఎన్ ఖీమ్యా నాయక్, కే గంగాధర్ ఉన్నారు.
హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ) : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా 47మంది మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందిని బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న, దీర్ఘకాలంగా అదే చోట ఉన్న కమిషనర్లు, సిబ్బందిని బదిలీ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.