DSP Transfers | రాష్ట్రంలో 16 మంది డీఎస్పీల బదిలీలు..!
DSP Transfers | రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ చేసిన వారు తాము పని చేస్తున్న స్థానాల నుంచి తక్షణం రిలీవ్ కావాలని డీజీపీ అంజినీ కుమార్ ఆదేశించారు.
DSP Transfers | రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 16 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులు తక్షణం తాము పని చేస్తున్న ప్రదేశాల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ అంజినీ కుమార్ తెలిపారు. వెంటనే నియమించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.
మహబూబాబాద్ ఎస్డీపీవోగా ఉన్న పి సాదయ్యను ప్రస్తుతం ఖాళీగా ఉన్న బెల్లంపల్లి,రామగుండం ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్స్ ఏసీపీగా పని చేస్తున్న ఎస్వీ హరికృష్ణను రాచకొండ కమిషనరేట్ లోని ఎల్బీ నగర్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు.
నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న ఎం కిరణ్ కుమార్ ను నిజామాబాద్ లా అండ్ ఆర్డర్ విభాగం ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పుడు అక్కడ పని చేస్తున్న ఏ వెంకటేశ్వర్లును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
రాచకొండ కమిషనరేట్ పీడీ సెల్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్‌ను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైఫాబాద్ ఏసీపీగా నియమించారు. ఇప్పుడు అక్కడ పని చేస్తున్న సీహెచ్ వేణుగోపాల్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా పని చేస్తున్న సీహెచ్ శ్రీధర్‌ను బంజారా హిల్స్ ఏసీపీగా నియమించారు. అక్కడ ఇప్పుడు పని చేస్తున్న ఎం సుదర్శన్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కొంపల్లి సీఐడీ డీఎస్పీ (డయల్100కు కేటాయించిన) పీ సుబ్బయ్యను కొత్తగా నెలకొల్పిన జుబ్లీహిల్స్ ఏసీపీగా నియమించారు. డీజీపీ ఆఫీసులో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీ (సివిల్) కదురా వెంకట్ రెడ్డిని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు.
జగిత్యాల డీసీఆర్బీ ఫంక్షనల్ వెర్టికల్స్ డీఎస్పీగా పని చేస్తున్న బొజ్జా రామానుజంను ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీగా ఉన్న కస్తూరి శ్రీనివాస్‌ను హైదరాబాద్ నగర పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబర్ పేట ఏసీపీగా నియమించారు.
రాజన్న -సిరిసిల్ల డీసీఆర్బీ ఫంక్షనల్ వెర్టికల్స్ డీఎస్పీగా పని చేస్తున్న బోనాలా క్రుష్ణను వరంగల్ లా అండ్ ఆర్డర్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ పని చేస్తున్న కే గిరిని.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి ఏసీపీగా పని చేస్తున్న కే నర్సింహారెడ్డిని తిరిగి అక్కడే నియమించారు. భువనగిరి-రాచకొండ ట్రాఫిక్ ఏసీపీ ఎన్ సైదులును రాచకొండ కమిషనరేట్ యాదగిరిగుట్ట ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

