16 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్బీఏ గుర్తింపు
రాష్ట్రంలోని 16 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 31 కోర్సులు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపును దక్కించుకొన్నాయి. గతంలో మూడు కాలేజీలకు ఈ గుర్తింపు లభించగా, తాజాగా మరో 16 కళాశాలలు ఈ వరుసలో చేరాయి.
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 16 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 31 కోర్సులు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపును దక్కించుకొన్నాయి. గతంలో మూడు కాలేజీలకు ఈ గుర్తింపు లభించగా, తాజాగా మరో 16 కళాశాలలు ఈ వరుసలో చేరాయి. ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొన్న 39 కాలేజీల్లో నిపుణుల కమిటీలు తనిఖీలు నిర్వహించి, నివేదికలిచ్చాయి.
ఆయా నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని 16 కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. ఎన్బీఏ గుర్తింపు దక్కించుకొన్న వాటిల్లో ఐదు కాలేజీల్లో కంప్యూటర్ ఇంజినీరింగ్, మూడు కాలేజీల్లో ఎలక్ట్రికల్, ఎనిమిది కాలేజీల్లో ఎలక్ట్రానిక్స్, ఐదు కాలేజీల్లో మెకానికల్, నాలుగు కాలేజీల్లో సివిల్స్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. ఈ గుర్తింపు గడువు జూన్ 2026కు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా, ఈ విద్యాసంవత్సరం మరో మూడు కాలేజీలు ప్రారంభంకానున్నాయి.
ఎన్బీఏతో ఉపయోగాలు..
- పాత కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు ఉంటేనే కొత్త కోర్సులకు అనుమతులిస్తున్నారు.
- ఈ కాలేజీల్లో అత్యుత్తమ ప్రమాణాలున్నట్టుగా, నాణ్యమైన బోధన కొనసాగుతున్నట్టుగా పరిగణనలోకి తీసుకొంటారు.
- ఈ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో ప్రాధాన్యం ఇస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

