కొత్తగా 1500 ఆర్టీసీ బస్సులు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటి నుంచి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో సీట్ల కోసం కొట్లాటలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.
- కొనుగోలుకు టీఎస్ఆర్టీసీ నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటి నుంచి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో సీట్ల కోసం కొట్లాటలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1500 ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలైనంత మేరకు అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ తీసుకొంటున్నది. ఇప్పుడున్న పాత బస్సుల స్థానంలో కొత్తవి కొనేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
జూలై కల్లా 450 ఎలక్ట్రిక్ బస్సులు
ఇక పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పుడు దాదాపు 105 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యి పైచిలుకు రోడ్డెకించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో జూలై కల్లా 450 అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సులను నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు.. అదేవిధంగా జిల్లాల్లో ఇతర ప్రాంతాలకు నడిపించేలా ఆర్టీసీ కార్యాచరణకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

