Chicken | చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 15 : చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కమ్మరి శంకరయ్య, సింగరాయ చెర్వు గ్రామంలోని సప్పిడి కృష్ణారెడ్డికి చెందిన ఫారాలలో శనివారం సుమారు 1,500 బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను సమీపంలో పూడ్చిపెట్టారు. కోళ్ల మృతిపై ఆందోళన చెందిన రైతులు స్థానిక పశువైద్యాధికారి పృథ్వీరాజ్‌కు తెలుపడంతో ఆయన కోళ్ల ఫారాలను పరిశీలించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కన్పించలేదని, గురక లాంటి వ్యాధితో కోళ్లు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ప్లూ లేదని తెలిపారు.