కందుకూరు, మే 13 : మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నియోజకవర్గంలోకి చేరిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు. క్యాడర్ను బలోపేతం చేసేందుకు పాదయాత్ర చేపట్టగా.. కమలంపార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారు.
మొన్న మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో, నిన్న దావుదాగూడలో, నేడు పులిమామిడిలో పలువురు కారు ఎక్కారు. కందుకూరు మండల పరిధిలోని పులిమామిడిలో సర్పంచ్ వత్తుల అనితా శ్రీనివాస్, వార్డు మెంబర్లు చైతన్య రాజుగంగయ్యతో పాటు 150మందికి పైగా బీజేపీ శ్రేణులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.