Degree Courses | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొత్తగా మరో 15 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 7 కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు భావించారు. స్థానిక అవకాశాలు, కాలేజీల విజ్ఞప్తుల మేరకు మొత్తంగా వాటి సంఖ్యను 22కు చేర్చారు. తొలుత ఆయా కోర్సులను 36 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టగా, ఇటీవలే మరో 30 ప్రైవేట్ కాలేజీల్లో నిర్వహణకు అనుమతిచ్చారు.
మూడేండ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు సంబంధిత పరిశ్రమల్లో అంప్రెటిస్షిప్ చేయాల్సి ఉంటుంది. మూడో విడత దోస్త్ కౌన్సెలింగ్లో వీటిని ఆప్షన్లుగా ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదల కావడంతో మూడో విడుత రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింతగా పెరగనున్నది.
కొత్త కోర్సులు
-బీఏ-