విద్యానగర్, డిసెంబర్ 30: కమీషన్లకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు అని, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. సోమవారం తాజా మాజీ సర్పంచుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు అకినపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్‌ను కలిసి వి నతి పత్రం అందశారు. మాజీ సర్పంచులు ప్రజల కోసమే సొంత డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశారని, వారందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కా పాడలేని అసమర్థ సర్కారుకు ప్రజ లు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు.