హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ఏప్రిల్ 1నుంచి 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. 13 స్టేషన్లు హైదరాబాద్‌లో, ఒకటి వరంగల్ అర్బన్‌లో ఏర్పాటు కానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2020లోనే 14 కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి, వీటి కోసం సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి, సిబ్బందిని సైతం కేటాయించింది. వీటి ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డంరావడం, ప్రభుత్వం మారడంతో 15నెలల సమయం పట్టింది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ ఆమోదముద్ర వేయడంతో వచ్చేనెల 1న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు కొత్త పోలీస్స్టేషన్లలో ఒకటో తేదీ నుంచి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు అద్దె భవనాలను గుర్తించాలని ఆదేశించడంతో అద్దె భవనాల గుర్తింపు దాదాపు పూర్తయింది. ప్రతీ కొత్త ఎక్సైజ్పోలీస్స్టేషన్కు ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు.