Kawal Tiger Reserve | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, గోదావరి పరీవాహక ప్రాంతం పక్షి వైవిధ్యం, సంరక్షణకు నిలయంగా మారింది. మంచిర్యాల జిల్లాలోని చెరువులు, కుంటల్లో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. రష్యా, మంగోలియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వియత్నాం నుంచి కవ్వాల్ అభయారణ్యంలోకి 132 జాతుల జాతుల పక్షులు సేదతీరడానికి చేరుకున్నాయి.
లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్పేట్ చెరువు పక్షులతో చూడముచ్చటగా కనిపిస్తున్నది. పక్షుల వీక్షణం, అధ్యయనం కోసం అటవీశాఖ అధికారులు బర్డ్ ఫెస్టివల్ నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగిన కార్యక్రమానికి పక్షి ప్రేమికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులు అరుదుగా కనిపించే పక్షులను ఆసక్తిగా తిలకించారు. పక్షుల ప్రాముఖ్యత ప్రతిఒకరూ తెలుసుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫర్ ఫారెస్ట్స్ సువర్ణ కోరారు. పక్షుల పరిరక్షణ అందరి బాధ్యత అని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివఆశీశ్సింగ్ చెప్పారు.