శంషాబాద్ రూరల్, ఆగస్టు 12: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 13.3 కోట్ల విలువైన గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళా ప్రయాణికురాలిపై అనుమానం రావడంతో డీఆర్ఐ అధికారులు ఆమె వద్ద ఉన్న బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో బ్యాగులో 20 ప్యాకెట్ల గంజాయి లభించగా, వెంటనే స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.13 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మహిళను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.