బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఓ యోధుని జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి హనుమరెడ్డి యక్కంటి దర్శకుడు. నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మాతలు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా ఇందులో కథానాయికగా నటిస్తున్నది. ఈ విషయాన్ని శుక్రవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని, ఇందులో మనోజ్ కొత్త అవతారంలో కనిపిస్తారని, మనోజ్‌కి ఈ సినిమా ఓ మంచి కంబ్యాక్ అవుతుందని మేకర్స్ తెలిపారు. ఆర్.పార్తీబన్, కాంచన ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సంగీతం: రవి బస్రూర్.