హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో కదలిక మొదలైంది. 2026 మే ఒకటి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 1,213 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 85, కుమ్రంభీంలో 78, కామారెడ్డిలో 68, జనగామలో 64 ఖాళీలు ఉన్నాయి. అత్యల్పంగా సంగారెడ్డిలో 12, హనుమకొండలో 14, వరంగల్ లో 14, మంచిర్యాలలో 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే మేడ్చల్-మలాజిగిరి జిల్లాలో జీపీల సంఖ్య సున్నాగా ఉన్నప్పటికీ, అకడ 18 ఖాళీలు చూపించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జోన్లవారీ ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది.