హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : జేఈఈ ప్రశ్నపత్రాల్లో తప్పులు పునరావృతమవుతున్నాయి. దాంతో ఈ సారి మెయిన్స్‌లో ఏకంగా 12 ప్రశ్నలను ఎన్టీఏ ఉపసంహరించింది. ఫిజిక్స్‌లో 8, కెమిస్ట్రీ 2, గణితంలో 2 చొప్పున ఉపసంహరించారు. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసే అవకాశాలున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ (జేఎల్)పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 13 నుంచి 19 వరకు గన్‌ఫౌండ్రీలోని మహబూబియా జూనియర్ కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆర్జేడీ జయప్రదాబాయి తెలిపారు. మల్టీజోన్-1లో 659, మల్టీజోన్-2లో 627 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్‌లో తొలుత ఆప్షన్లు ఎంచుకునే అవకాశమిస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేయనున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ తప్పుల సవరణలో ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశమిచ్చారు.