హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): బీసీ విద్యార్థులకు సంబంధించి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వం రూ.12.34 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటనకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. గత నెల 22 ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇన్లెట్ వైపు 13.85 కి.మీటర్ వద్ద సొరంగం కూలిపోవడం, ఈ ఘటనలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే