హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ ఏడాది 117 మందిని వరించాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వేర్వేరు జీవోలు విడుదల చేశారు. ఉన్నత విద్య లో అత్యధికంగా 55 మంది అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎంపికయ్యారు. పాఠశాల విద్యలో 47, ఇంట ర్ విద్యలో 11 మంది, సాంకేతిక విద్య లో నలుగురిని అవార్డులు వరించాయి. రూ.10వేల నగదు, సర్టిఫికెట్, మెడల్‌ను అందజేయడంతోపాటు రవీంద్రభారతిలో గురువారం వీరిని సన్మానిస్తారు. విద్యాశాఖ మంత్రి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరుకానున్నారు. మోడల్ స్కూల్ టీచర్లు, డైట్ కాలే జీ లెక్చరర్లు, కేజీబీవీ టీచర్లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై గెజిటెడ్ హె చ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, పలువురు అసంతృప్తి వ్య క్తంచేశారు. అ వార్డుల కోసం పైరవీలు సాగినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరో ఆ రుగురుతో ఇంకో జాబితా విడుదలైం ది. పెద్ద ఎత్తున ఒత్తిడి వల్లే మరో ఆరుగురికి చోటు కల్పించినట్టు సమాచారం.
పీఈటీల తుది ఫలితాలు ఎప్పుడో!
హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేశారు.. కానీ రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చి.. ఆ తర్వాత తుది ఫలితాలు విడుదల చే యడం లేదని టీజీపీఎస్సీ అధికారులపై బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. పీఈటీ పోస్టుల కోసం ఇప్పటికే ఎనిమిదేండ్ల నుంచి ఎదురు చూస్తున్నామని, ఇంకెన్నేండ్లు చూ డాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చిన త ర్వాత పోస్టులకు ఎంతమంది ముం దుకు వచ్చారు? ఎన్ని పోస్టులు ఉ న్నాయనే విషయంలో స్పష్టత ఇవ్వాలని, దీంతో పోస్టింగ్‌లో మార్పులకు అవకాశం ఉంటుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. న్యాయం కోసం టీజీపీఎస్సీ ఎదుట రేపు(6న) ధర్నా చేస్తామని తెలిపారు.