హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): జిల్లాల పునర్విభజన ప్రకారం కొత్తగా ఏర్పడిన 14 ఎక్సైజ్ స్టేషన్లలో సిబ్బంది కొరతను తీర్చేందుకు 116 సూపర్ న్యూమరీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
మల్టీజోన్-1లోని భద్రాద్రి జోన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, రూరల్‌కు 6 పోస్టులు, మల్టీజోన్-2లోని యాదాద్రి జోన్లో సూర్యాపేట, నల్లగొండ యాదాద్రి భువనగిరి, జనగామకు 6 పోస్టులు, మల్టీజోన్-2లోని చార్మినార్‌జోన్‌లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌కు 104 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అకాడమీలో ఉన్న కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తికాగానే ఈ పోస్టుల్లో వారిని పునరుద్ధరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా, 614 ఎక్సైజ్ పోస్టులకు కేవలం 530 మంది మాత్రమే శిక్షణకు వచ్చారు. గ్రూప్-4 తుది ఫలితాలు వస్తే 150 మంది వరకు శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు కూడా వెళ్లే అవకాశం ఉంది. దీంతో మళ్లీ సగం ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ అవనున్నాయి.