హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించినట్టు పేర్కొన్నారు.
అయితే తొలిరోజే 11,060 మంది విద్యార్థులు డుమ్మా కొట్టినట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 7,591, సెకండియర్‌లో 3,469 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని వివరించారు. ఫస్టియర్‌లో 92.25శాతం, సెకండియర్‌లో 87.59శాతం విద్యార్థులు హాజరైనట్టు ఆయన వెల్లడించారు.