ఇల్లు అద్దెకిస్తే కబ్జా చేసిండు
తెలిసిన వాళ్లే కదా అని.. దయ తలచి రేకుల గదులను అద్దెకిస్తే, అదును చూసి ఇంటిని కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా దర్జాగా రేకుల గదులను కూల్చి ఇంటి నిర్మాణం సైతం చేపట్టారు. ఇదేంటని ప్రశ్నించిన యజమానిని కబ్జాదారులు చితకబాదారు. ఇదంతా ఎకడో మారుమూల పల్లెలో లేదా ఏజెన్సీ ప్రాంతంలో అనుకుంటే పొరపాటే.
- గదులు కూల్చి ఏకంగా బిల్డింగ్ నిర్మాణం
- అడ్డుకున్న యజమానిని చితకబాదిన కబ్జాదారుడు
- కూల్చి ఏకంగా బిల్డింగ్ నిర్మాణం
- యజమానిని కబ్జాదారుడు
- ఆదేశించినా అడ్డుకోని ప్లానింగ్ అధికారులు
- ప్రేమ్ నగర్లో దారుణం
కొండాపూర్, మే 13 : తెలిసిన వాళ్లే కదా అని.. దయ తలచి రేకుల గదులను అద్దెకిస్తే, అదును చూసి ఇంటిని కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా దర్జాగా రేకుల గదులను కూల్చి ఇంటి నిర్మాణం సైతం చేపట్టారు. ఇదేంటని ప్రశ్నించిన యజమానిని కబ్జాదారులు చితకబాదారు. ఇదంతా ఎకడో మారుమూల పల్లెలో లేదా ఏజెన్సీ ప్రాంతంలో అనుకుంటే పొరపాటే. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో, హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి సరిల్ కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ప్రేమ్ నగర్లో కొన్నేళ్లుగా నివాసముంటున్న బాబురావు, అదే కాలనీకి చెందిన కన్నారావు నుంచి 1400 గజాల స్థలాన్ని 1998లో రూ.3,50,000కు కొనుగోలు చేశాడు.
కాగా అందులో 300 గజాల్లో ఉన్న రేకుల గదులను మహానంది సాగర్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. కొంతకాలం బాగానే ఉన్న మహానంది సాగర్, బాబు రావు పరిస్థితులను ఆసరాగా తీసుకుని అద్దె ఇవ్వడం మానేశాడు. సదరు ఇంటిని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటూ మొండిగా తయారయ్యాడు. బాబురావు వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సదరు కబ్జాదారుడు ఉంటున్న రేకుల గదులను కూల్చివేసి, ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. విషయం తెలుసుకున్న బాబురావు అడ్డుకునేందుకు వెళ్తే కుటుంబ సభ్యులతో కలిసి అతన్ని చితకబాదారు. అటువైపు వస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు, మున్సిపల్ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
నిర్మాణాన్ని కూల్చివేయాలని కోర్టు ఆదేశాలు
తనకు జరిగిన అన్యాయంపై బాబు రావు మున్సిపల్ అధికారులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందకపోగా.. సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని సైతం అడ్డుకోలేకపోయారు. దీనిపై కోర్టుకెళ్లిన బాబురావుకు ఊరట లభించింది. సదరు స్థలంలో కొనసాగుతున్న నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ మున్సిపల్ (టౌన్ ప్లానింగ్) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు అవేదన వ్యక్తం చేస్తున్నాడు.
న్యాయస్థానం ఆదేశాలను సైతం పట్టించుకోకపోతే మాలాంటి పేదలకు ప్రజా పాలనలో న్యాయం ఎకడ దొరుకుతుందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. రేపు మాపు అంటూ లేనిపోని సాకులు చెబుతూ కాలం వెల్లడిస్తున్నారని, పునాదుల సమయంలో ఫిర్యాదు చేస్తే 4 అంతస్తుల నిర్మాణం జరిగినా స్పందించలేదని వాపోయాడు. అధికారుల చుట్టూ తిరిగే ఓపిక, శక్తి తనకు లేదని, సదరు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని అవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇకనైనా టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

