Congress Govt | హైదరాబాద్ మే 19 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, క్రమం తప్పకుండా జాబ్‌క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 5089 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మరో 6000 పోస్టులకు నోటిఫికేషన్ వివిధ దశల్లో ఉంది.
బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన 45వేల ఉద్యోగాలను కూడ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డీఎస్సీ, హెల్త్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సర్జన్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, గ్రూప్-2 కింద ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్స్, ఫార్మాసిస్ట్‌ల నియామకానికి నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది.
ఆరోగ్యశాఖలో మొత్తంగా 5, 213 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే బీఆర్ఎస్ హయాంలో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, మరో 60 పోస్టులు చేర్చి 563 ఖాళీల భర్తీకి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తంగా 11, 246 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గప్పాలు కొట్టడంపై విద్యానిపుణులు, మేధావులు, విద్యార్థులు పెదవివిరుస్తున్నారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి నిరుద్యోగులను ఆదుకున్నం..అనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేవి..ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేసిన్రు..కానీ మన ప్రభుత్వంలో వెంటవెంటనే నోటిఫికేషన్లు ఇస్తుంటే కష్టమవుతున్నది.. నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి..అవసరమైతే కొన్ని తగ్గించండి..అని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది..దేశంలో ఎక్కడాకూడా నోటిఫికేషన్లు వద్దని, వాయిదా వేయాలని ధర్నాలు జరుగలె..అంటే దీనినిబట్టి నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి..’
– అమ్రాబాద్ మండలం మాచారం బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఖాళీలు: 11,062( బీఆర్ఎస్ హయాంలో 5,089)
విద్యాశాఖలో : 5,973 (కాంగ్రెస్ హయాంలో)
వైద్యశాఖలో : 5, 213 (కాంగ్రెస్ హయాంలో)
గ్రూప్-1 60 (కాంగ్రెస్ హయాంలో)
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్
నోటిఫికేషన్ తేదీ: 28-06-24
ఖాళీలు: 435
ఖాళీలు: 45 ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్-2)
నోటిఫికేషన్: 11-09-24
ఖాళీలు: 2,050