చెన్నై: ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) తర్వాత భారత ఎన్నికల సంఘం సోమవారం తమిళనాడు ఓటర్ల తుది జాబితాను వెలువరిచింది. 74.7 లక్షల మందికి పైగా పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. రాష్ట్ర సీఈవో అర్చన పట్నాయక్ చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల నమోదిత ఓటర్లు ఉన్నారు. సర్ తర్వాత ఆ సంఖ్య 5.67 కోట్లకు తగ్గింది. సోమవారం వెలువరించిన జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు.