హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ లోక్ అదాలత్‌లలో 11.06 లక్షల కేసులు పరిషారమైనట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి శనివారం వెల్లడించారు.
తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీ శ్యాంకోశీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మౌసమీ భట్టాచార్య సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో 11.06 లక్షల కేసులు పరిషారమయ్యాయని తెలిపారు. ఇందులో ప్రీ లిటిగేషన్ కేసులు 3.63 లక్షలు, కోర్టుల్లో పెండింగ్ ఉన్నవి 7.43 లక్షల కేసులు పరిషారమయ్యాయని, లబ్ధిదారులకు రూ.595 కోట్లను పరిహారంగా ప్రకటించామని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి అంగవైకల్యాన్ని ఎదురొంటున్న బీటెక్ విద్యార్థి పవన్‌కుమార్‌కు శనివారం లోక్‌అదాలత్ ద్వారా న్యాయం జరిగింది. ట్రిబ్యునల్ ప్రకటించిన రూ.98.30 లక్షల పరిహారాన్ని 6 శాతం వడ్డీ కలిపి రూ.1.20 కోట్లు అందించడానికి న్యూఇండియా అస్స్యూరెన్స్ కంపెనీ అంగీకరించింది.
ఈ చెకును హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ మౌసమీ భట్టాచార్య చేతులమీదుగా అందజేసినట్టు కమిటీ కార్యదర్శి ఎం శాంతివర్ధని తెలిపారు. లోక్ అదాలత్‌లో మాజీ హైకో ర్టు న్యాయమూర్తులు జీవీ సీతాపతి, జీ శ్రీదేవి కేసులను విచారించి 180 కేసులను పరిషరించారని తెలిపారు.