చౌటుప్పల్‌లో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ.. 11 మందికి గాయాలు
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సును గుండ్లబావి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల్లో 11 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

