హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
ఏప్రిల్ 7 నుంచి 15 వరకు తొమ్మిది రోజులపాటు మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్నాయి.