హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలస్య రుసుము రూ.50తో 29 వరకు, రూ.200లతో డిసెంబర్ 2 నుంచి 11 వరకు, రూ.500లతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు అవకాశం ఇచ్చినట్టు ఉత్తర్వులో పేర్కొన్నది.