Badi Bata | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గురువారం రెండో రోజు బడిబాట నిర్వహించారు. అన్ని ప్రభుత్వ బడులలో 10,577 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశం పొందినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు. ఒకటో తరగతిలో 24,082 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు పేర్కొన్నారు. 2,47,335 మంది విద్యార్థులకు యూనిఫాంలు, 1,13,727 మందికి పాఠ్యపుస్తకాలు, 16,633 మందికి నోటు పుస్తకాలు, 40,975 మంది విద్యార్థులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.