హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ వర్సిటీల్లో అకాడమిక్, రీసెర్చ్ ప్రమాణాల పెంపునకు సర్కార్ కొత్త దిశను నిర్దేశం చేసింది. అన్ని వర్సిటీలకు వంద రోజుల యాక్షన్‌ప్లాన్‌ను లక్ష్యంగా నిర్దేశించింది. బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన వీసీల కాన్ఫరెన్స్‌లో ఈ వంద రోజుల యాక్షన్ప్లాన్పై చర్చించారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ దోత్రే తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.