హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కామారెడ్డిలోని బిచ్కుంద దవాఖానను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) కమిషనర్ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అప్గ్రేడేషన్ పనుల నిమిత్తం రూ.26 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.