హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్’ ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టు కింద 19 నియోజకవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న జాబితాలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలే ఉండటం గమనార్హం.
19లో 10 మంత్రులవే..
‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్’కు ఎంపిక చేసిన 19 నియోజకవర్గాల్లో పది మంత్రులవే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, తుమ్మల , జూపల్లి , పొంగులేటి, దామోదర ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, పాలేరు, అందోల్ నియోజకవర్గాలు ఉన్నాయి.