హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 2007 నుంచి 2010 మధ్య రిటైర్డ్ ఉద్యోగులకు గరిష్ఠ పరిమితి ప్రకారం రూ.10 లక్షల గ్రాట్యుటీ చెల్లించాల ని హైకోర్టు ఆదేశించింది. అప్పిలేట్ అథారి టీ ఉత్తర్వులకు అనుగుణంగా రూ.10 లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సంస్థ వేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధ ర్మాసనం కొట్టివేసింది. గ్రాట్యుటీ సీలింగ్‌ను రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెం చుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసి న నోటిఫికేషన్ 2010 మే 24 నుంచి అమల్లోకి వచ్చిందని, కనుక ఈసీఐఎల్ ట్రస్ట్ ని బంధనల ప్రకారం రూ.3.5 లక్షల గ్రాట్యుటీ చెల్లించడమే సబబని సంస్థ న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.