Srisailam | హైదరాబాద్ : కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,95,563 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,46,374 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం 10 స్పిల్ వే గేట్లు ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 209.15 టీఎంసీలుగా ఉంది.