కోటపల్లి, అక్టోబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్లో భాగంగా శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలోని చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.1.90 లక్షల నగదు పట్టుకున్నట్టు ఎస్సై రాజేందర్ తెలిపారు. మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా రేగుంట గ్రామానికి చెందిన గడిపెల్లి సాయి స్కార్పియో వాహనంలో రూ.1.90 లక్షల నగదు తరలిస్తూ పట్టుబడ్డాడు.
ఇతను నాగాపూర్ నుంచి వస్తున్నాడని, వాహనంలో తరలిస్తున్న డబ్బుకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో సదరు మొత్తాన్ని సీజ్ చేసి కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావుకు అప్పగించినట్టు ఎస్సై పేర్కొన్నారు.