Sankranti | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ పల్లెబా ట పట్టారు. దీంతో హైదరాబాద్ నుం చి విజయవాడ, కర్నూలు, తమిళనా డు వెళ్లే దారులన్నీ వాహనాలతో కికిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది. చౌటుప్పల్, తుప్రాన్‌పేట, ఆందోల్ మైసమ్మ, పంతంగి టోల్‌ప్లాజా తదిత ర ప్రాంతాల వద్ద పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. మూడు రో జుల్లో 11టోల్గేట్ల ద్వారా ఏపీ వైపు సుమారు 1,78,000 వాహనాలు వెళ్లాయి.