జోగులాంబ గద్వాల: జూరాల (Jurala) ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోకి లక్షా 61 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దీంతో అధికారులు జలాశయం 37 గేట్లు ఎత్తి లక్షా 46 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం జలాశయంలో 317.750 మీటర్ల నీటిమట్టం ఉన్నది. జూరాల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా, 8.126 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.