అగ్ర నటుడు చిరంజీవి జన్మదినం సందర్భంగా గత నెలలో విడుదల చేసిన ఆయన తాజా చిత్రం ‘కాకా’ ఫస్ట్‌గ్లింప్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ‘ఇది సత్యం మాట..ఇంకా డౌటా’ అంటూ చిరంజీవి రెండు భిన్నమైన గెటప్స్‌లో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ అంశాల కలబోతగా పవర్ఫుల్ కథాంశంతో దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మేకర్స్ కొత్త అప్డేట్ను అందించారు.
ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో ‘కాకా’ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. కొన్ని వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. ఈ మేరకు విడుదల చేసిన ఆన్‌లొకేషన్ వర్కింగ్స్టిల్లో చిరంజీవి, దర్శకుడు బాబీ సీరియస్ డిస్కషన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాత: వెంకట్ కె నారాయణ, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.