యాదాద్రి, నవంబర్ 6: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. శనివారం శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని జస్టిస్ సుభాష్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. ఆయనకు అధికారు లు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం చేసి, ప్రసాదం అందజేశారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి సుభాష్‌రెడ్డి యా దాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుభాష్‌రెడ్డి మా ట్లాడుతూ.. సాధ్యమైనంత తొందరగా యాదాద్రి పనులను పూర్తి చేసుకొని భక్తులందరికీ ఒకే రకమైన దర్శన భాగ్యం కలుగాలని ఆకాంక్షించారు. ప్రముఖులతోపాటు సాధారణ భక్తులకు సైతం మంచి దర్శనం లభించేలా ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని అభినందించారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి వ్యక్తీ యాదాద్రి దర్శించుకోకుండా ఉండలేరని అభిప్రాయపడ్డారు.